Audio download link, Balakrishnapradad, in Tilang ragam
ఏవం శ్రుతిమత మిదమేవ త-
ద్భావయితు మతఃపరం నాస్తి
అతుల జన్మభోగాసక్తానాం
హితవైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరి సంకీర్తనం త-
ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి
బహుళమరణ పరిభవచిత్తానా-
మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త-
ద్విహరణం వినా విధిరపి నాస్తి
సంసారదురిత జాడ్యపరాణాం
హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
శంసైవాం పశ్చాదిహనాస్తి
EvaM Srutimata midamEva ta-
dbhAvayitu mata@hparaM nAsti
atula janmabhOgAsaktAnAM
hitavaibhavasukha midamEva
satataM SrIhari saMkIrtanaM ta-
dwyatiriktasukhaM vaktuM nAsti
bahuLamaraNa paribhavachittAnA-
mihaparasAdhana midamEva
ahiSayanamanOharasEvA ta-
dviharaNaM vinA vidhirapi nAsti
saMsAradurita jADyaparANAM
hiMsAvirahita midamEva
kaMsAMtaka vEMkaTagiripatE@h pra-
SaMsaivAM paSchAdihanAsti
| భగవంతుని నిర్మల అంతఃకరణముతో కీర్తించుట మాత్రమే వేద సమ్మతమైన మతము అని స్పష్టంగా అన్నమయ్య ఈ సంకీర్తనలో ఎలుగెత్తి చాటుతున్నాడు!. మనం ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది అని తగవులాడుకుంటూ కాలాన్ని వ్యర్దం చేసుకుంటాం! అలాకాక అన్నమయ్య చెప్పినట్టు ఈ సంకీర్తనామతాన్ని ఆచరిస్తే శ్రీహరి కృపకు సులభంగా పాతృలవుతాం. |
| |
1. వ చరణం అతుల భోగాసక్తానాం = సాటిలేని జన్మభోగములయందు ఆసక్తులైన వారికి హితవైభవసుఖం = మేలు గూర్చు ఐశ్వర్య సుఖము ఇదం ఏవ = ఇదియే (అది) సతతం = ఎల్లప్పుడు శ్రీహరి సంకీర్తనం = శ్రీ మన్నారాయణుని సంకీర్తనయే తద్వ్యతిరిక్తసుఖం = దానికంటే వేఱైన సుఖము వక్తుం = చెప్పుటకు నాస్తి = లేదు |
| |
2. వ చరణం బహుళ మరణ పరిభవచిత్తానాం = అనేకములైన మరణావమానములతో కూడిన మనస్సుగల వారికి ఇహపరసాధనం = ఇహలోకమునందున, పరలోకమందును (ఉత్తమగతికి) సాధనమైనది ఇదం ఏవ = ఇదియే అహిశయన మనోహరసేవా = శేషశయనుడైన శ్రీహరి యొక్క మనోహరమైన సేవయే తద్విహరణం వినా = ఆ సేవా విహారము దప్ప విధిరపి = (మరొక) విధానము గూడ నాస్తి = లేదు |
3. వ చరణం సంసార దురిత జాడ్యపరాణాం = సంసార పాపమనెడు రోగములకు వశులైన వారికి హింసావిరహితం = హింసలేనిది ఇదం ఏవ = ఇదియే (అది) కంసాంతక వేంకటగిరిపతే = కంసనాశకుడైన శ్రీ వేంకటాచలపతి యొక్క ప్రశంసా ఏవ = గుణకీర్తనమే ఇహ = ఈ విషయమునందు పశ్చాత్ = దీని వెనుక (దీనికంటే) నాస్తి = (మరొక మేలైన త్రోవ) లేదు |